Google: జాక్‌పాట్‌ కొట్టేశాడు.. గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డు.. ఎందుకో తెలుసా..?

|

Feb 15, 2022 | 10:36 AM

Google: ఓ వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టేశాడు. మన దేశానికి చెందిన ఓ యువకుడికి గూగుల్‌ భారీ ఎత్తున రివార్డును చెల్లించింది. గూగుల్‌ (Google)కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ..

Google: జాక్‌పాట్‌ కొట్టేశాడు.. గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డు.. ఎందుకో తెలుసా..?
Follow us on

Google: ఓ వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టేశాడు. మన దేశానికి చెందిన ఓ యువకుడికి గూగుల్‌ భారీ ఎత్తున రివార్డును చెల్లించింది. గూగుల్‌ (Google)కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ లోపాలు (బగ్స్‌) గుర్తించిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయల రివార్డును అందించింది గూగుల్‌. ఇండియాకు చెందిన అమన్‌ పాండే (Aman Pandey) అనే వ్యక్తి ఎన్‌ఐటీ భోపాల్‌లో పట్టభద్రుడు. అయితే ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాలను గుర్తించేందుకు గత సంవత్సరం బగ్స్‌ మిర్రర్‌ పేరిట ఓ కంపెనీని నెలకొల్పాడు. గూగుల్‌ తమ కంపెనీలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాలను గుర్తించిన వారికి భారీ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం వల్నరబిలటీ రివార్డు ప్రోగ్రామ్‌ 2021 (Vulnerability Rewards)ను నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్‌ పాండే.. గూగుల్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్‌ క్రోమ్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందలాది సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఏడాదిలోనే గూగుల్‌తోపాటు ఆ సంస్థకు చెందిన మిగతా కంపెనీలకు చెందిన సాఫ్ట్‌ వేర్‌లలో మొత్తం 232 లోపాలను గుర్తించాడు అమన్‌ పాండే. దీంతో గూగుల్‌ ఆయనను ప్రత్యేకంగా అభినందించి రూ.65 కోట్ల రివార్డును అందిస్తున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Change-5 Rocket: చంద్రుడిపై కూలనున్న చైనా ఛేంజ్ 5- మిషన్ రాకెట్.. బట్టబయలు చేసిన శాస్త్రవేత్త..!

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యతో ఇబ్బంది పడతున్నారా..? ఇలా చేయండి..!