Google CEO: కొవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అంచనాలకు మించిన పనితీరు కనబరిచాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థలను నిర్వహించే సీఈవోలకు అందించే జీతభత్యాలు, బోనస్‌లను ఊహించని రీతిలో పెంచాయి. కానీ.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai) కు మాత్రం గూగుల్ సంస్థ షాక్ ఇచ్చింది. అదేంటంటే.. సుందర్ పిచాయ్‌కు అందిస్తున్న బోనస్‌ను 14 శాతం తగ్గించినట్లు ఫైన్‌బోల్డ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇదే సంయమలో.. భారీగా బోనస్‌లు పెరిగిన సీఈవోల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్‌కామ్ సీఈవో తాన్ హాక్ ఎంగ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన అత్యధికంగా 1,586 శాతం బోనస్ పొందుతున్నారు. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈవో పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, అమెజాన్ సీఈవో ఆండీ జెస్పీ అత్యధికంగా బోనస్ అందుకుంటున్న సీఈవోల జాబితాలో నిలిచారు.
ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్‌లు పొందిన సీఈవోల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందుతున్నారు. ఇంటెల్ సీఈవో పాట గ్లెసింగెర్ 713.64శాతం బోనస్ అందుకుంటున్నారు. అదే సమయంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్ తీసుకుంటుండగా.., అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ 491.9 శాతం బోనస్ సొంతం చేసుకున్నారు.
మరో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్, సిస్కో సీఈవో చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతం అందుకుంటున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు మాత్రం గూగుల్ కంపెనీ 14 శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.14 కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1,707కోట్లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ నివేదిక వెల్లడించింది.
ఇవీ చదవండి..
Stock Market: వారాంతంలో మార్కెట్ల బేజారు.. మళ్లీ నష్టాల్లోకి కీలక సూచీలు.. ఎందుకంటే..