Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..

|

Apr 15, 2022 | 3:19 PM

Fraction Shares: దేశంలోని చిన్న పెట్టుబడిదారులు(Investors) త్వరలో ఖరీదైన స్టాక్‌లలో కూడా డబ్బును పెట్టుబడి పెట్టే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల వారు ఖరీదైన షేర్లలో(Expensive Shares) చిన్న భాగాన్ని 100 రూపాయలకే కొనుగోలు చేయగలుగుతారు.

Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..
Stock Investment
Follow us on

Fraction Shares: దేశంలోని చిన్న పెట్టుబడిదారులు(Investors) త్వరలో ఖరీదైన స్టాక్‌లలో కూడా డబ్బును పెట్టుబడి పెట్టే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల వారు ఖరీదైన షేర్లలో(Expensive Shares) చిన్న భాగాన్ని 100 రూపాయలకే కొనుగోలు చేయగలుగుతారు. కంపెనీ లా కమిటీ తన నివేదికలో దేశంలో పాక్షిక షేర్లను అనుమతించాలని సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు.. US, UK, జపాన్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. ప్రస్తుత కంపెనీస్ యాక్ట్ ప్రకారం.. కంపెనీలకు పాక్షిక షేర్లను జారీ చేయడానికి అనుమతి లేదని కమిటీ పేర్కొంది. దీన్ని అనుమతించినట్లయితే, రిటైల్ పెట్టుబడిదారులు అధిక విలువ కలిగిన స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపిన నివేదికలో కంపెనీ లా కమిటీ పేర్కొంది. దీనివల్ల క్యాపిటల్ మార్కెట్‌కు భారీగా నిధులు వస్తాయని తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలోనే 1.42 కోట్ల మంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించారు. లా కన్సల్టెన్సీ సంస్థ J.J. సాగర్ అసోసియేట్స్ భాగస్వామి ఆనంద్ లక్రా మాట్లాడుతూ “స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఫ్రాక్షనల్ షేర్ల ట్రేడింగ్‌ను అనుమతించాలనే సిఫార్సు మంచి నిర్ణయం. ఇది ప్రస్తుతం పెట్టుబడి పెట్టలేని స్టాక్‌ల్లో చిన్న పెట్టుబడిదారులు డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం” లభిస్తుందని అన్నారు.

ఫ్రాక్షనల్ స్టాక్ నిర్ణయం కంపెనీలకు, పెట్టుబడిదారులకు విన్ విన్ స్ట్రాటజీగా చెప్పుకోవాలి. దీని వల్ల ఇద్దరికీ లాభం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పెట్టుబడికి కనీస యూనిట్ షేర్. అంటే కంపెనీలో కనీసం ఒక్క షేరునైనా కొనాలనే నిబంధన ఉంది. టైర్ కంపెనీ MRF షేరు (రూ. 67,500) అత్యంత ఖరీదైనది. పాక్షిక వాటా అనేది షేర్‌లో కొంత భాగం. మీరు MRFలో 100 రూపాయల పాక్షిక వాటాను తీసుకుంటే, మీరు దానిలో 675వ వంతును పొందుతారు. పెట్టుబడిదారులు వాటిని ట్రస్టీ ద్వారా కూడా విక్రయించవచ్చు. షేర్‌హోల్డర్‌లు తమ వాటాను విక్రయించినప్పుడు సమానమైన మొత్తాన్ని పొందుతారు. అటువంటి వాటాదారులు కంపెనీ జారీ చేసిన డివిడెండ్‌ను వారి వాటా రేషియోలోనే పొందుతారు. చాలా మంచి స్టాక్స్ ఎక్కువ రేటులో ఉంటుంటాయి. ఎవరైనా ప్రతి నెలా వేలాది షేర్లను కొనాలనుకుంటే.. రిలయన్స్, టీసీఎస్ లేదా నెస్లే షేర్లను ప్రస్తుత పద్ధతిలో కొనలేరు. ఎందుకంటే ఈ షేర్ల ధర వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా ఉండటం వల్లనే.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

IndiGo Flight: విమానంలో ప్రయాణికుడి మొబైల్‌ నుంచి మంటలు.. ప్రయాణికుల భయాందోళన

Chanakya Niti: డబ్బులు నిలవాలంటే ఇలా అస్సలు చేయకండి.. చాణక్యుడు చెప్పిన రహస్యం ఇదే..