SBI FD: గుడ్ న్యూస్.. ఆ పథకం గడువు మరోసారి పెంపు.. డిసెంబర్ 31 వరకూ అవకాశం..

ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరోసారి పెంచింది. ఆ పథకం పేరు ఎస్బీఐ అమృత్ కలష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. ఇది సాధారణ పౌరులతో పాటు సీనియర్ సిటిజెన్స్ కు కూడా మెరుగైన వడ్డీ రేటును అందిస్తోంది. దీనిలో పెట్టుబడి పెట్టడానికి 2023, డిసెంబర్ 31 ఆఖరుగా ప్రకటించింది.

SBI FD: గుడ్ న్యూస్.. ఆ పథకం గడువు మరోసారి పెంపు.. డిసెంబర్ 31 వరకూ అవకాశం..
Sbi

Updated on: Aug 19, 2023 | 8:00 AM

ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరోసారి పెంచింది. ఆ పథకం పేరు ఎస్బీఐ అమృత్ కలష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. ఇది సాధారణ పౌరులతో పాటు సీనియర్ సిటిజెన్స్ కు కూడా మెరుగైన వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ఫిబ్రవరి 15న ప్రారంభమవగా ఇప్పటికే పలు దఫాలుగా చివరి గడువు తేదీని పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు మరోసారి దానిని పెంచుతూ దీనిలో పెట్టుబడి పెట్టడానికి 2023, డిసెంబర్ 31 ఆఖరుగా ప్రకటించింది.

ఇది ఎస్బీఐ అమృత్ కలష్ పథకం..

ప్రజలు సురక్షిత పెట్టుబడి మార్గాలుగా భావించేవి ఫిక్స్ డ్ డిపాజిట్లు. అధిక రాబడితో పాటు భద్రతకు భరోసా ఇందులో ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటీజెన్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్. అన్ని బ్యాంకుల్లోనూ ఎఫ్డీలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. కొన్ని బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో ఎస్బీఐ అమృత్ కలశ్ ఒకటి. ఇది 400 రోజుల వ్యవధితో వచ్చే ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్. 2023, ఏప్రిల్ 12 నుంచి సీనియర్ సిటిజన్‌లకు 7.6%, సాధారణ పౌరులకు 7.1% వడ్డీని అందిస్తోంది. ఇది వచ్చే డిసెంబర్ 31 వరకూ డిపాజిట్లు స్వీకరిస్తుందని ఎస్బీఐ వెబ్ సైట్ల పేర్కొంది.

ఎవరు ప్రారంభిచొచ్చు..

అమృత్ కలాష్ డిపాజిట్ పథకం క్రింది వర్గాల వినియోగదారులకు అందుబాటులో ఉంది.

  • దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్ఐ రూపీ టర్మ్ డిపాజిట్లు(గరిష్టంగా రూ. 2 కోట్ల వరకూ)
  • కొత్త, పునరుద్ధరించబడిన డిపాజిట్లు.
  • టర్మ్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లు.

అమృత్ కలష్ పథకం వడ్డీ రేట్లు..

  • ఎస్బీఐ సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 7.5% వడ్డీ రేటును, వివిధ వ్యవధుల డిపాజిట్లపై ఇతరులకు 7% వరకు వడ్డీని అందిస్తుంది.
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధిపై బ్యాంక్ సాధారణ పౌరులకు 5.75% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 6.25% వడ్డీని అందిస్తుంది.
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి, సాధారణ పౌరులకు 6.8% సీనియర్ సిటిజన్‌లకు 7.3% వడ్డీని అందిస్తుంది.
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి బ్యాంక్ సాధారణ పౌరులకు 6.5% , సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీని అందిస్తుంది.
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ పౌరులకు 6.5%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీని అందిస్తుంది.

అయితే రూ. 5 లక్షల వరకు (వడ్డీతో సహా) డిపాజిట్లకు మాత్రమే ఆర్బీఐ డీఐసీజీసీ నిబంధనల ప్రకారం హామీ ఇస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..