
బంగారం ధరలు, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి దేశీయ మార్కెట్‌కు చౌకగా మారింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1900 కంటే ఎక్కువ తగ్గింది. ఆగస్ట్ 18వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,880 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ఇది కూడా చదవండి: ఖరీదైన కారు నంబర్ ప్లేట్.. దీని ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఇలా ధరలు క్రమంగా తగ్గడం బంగారం కొనుగోలుదారులకు మంచిదేనని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ధరల తగ్గుదల పసిడి మార్కెట్‌లో ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు. రాబోయే పండుగలు, వివాహ సీజన్లు మొదలైన సందర్భాలలో బంగారం కొనుగోలుకు ఇది ప్రోత్సాహం కల్పించే అవకాశముందని విశ్లేషకులు చెప్పుతున్నారు.
ఈ బంగారం ధరల మార్పుల వెనుక కీలక కారణంగా ప్రస్తుతం భారత్ – అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం. అంటే సుంకాల యుద్ధం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై, దేశీయ ఆర్థిక పరిస్థుతులపై ప్రభావం చూపుతుండటం వల్ల, బంగారం ధరలు కూడా పెరుగుతూనే ఇప్పుడు కొంతమేర తగ్గింది.
ఇది కూడా చదవండి: Hyderabad: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి.. నలుగురు సీరియస్