Latest Gold Silver Prices: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై 270 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,000 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,650 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 గా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.