Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. కొంతమేర పెరిగిన వెండి ధర, ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Dec 04, 2021 | 6:07 AM

Gold and Silver Price Today: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ..

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. కొంతమేర పెరిగిన వెండి ధర, ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలు పెట్టుబడి రూపంగా కూడా చూడబడుతుంది. స్వల్ప , దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు అనువైన లోగా పరిగణిస్తున్నారు.

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజు డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4,658 లు ఉండగా రూ. 13 తగ్గి ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,645లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 46,580 ఉండగా రూ. 130 తగ్గి రూ. 44,200లకు చేరుకుంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,758లు ఉండగా రూ. 13మేర తగ్గి ఈరోజు రూ. 4,745 లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రూ. 47,580 నుంచి ఈరోజు రూ. 130 ల మేర తగ్గి డిసెంబర్ 4వ తేదీ ఉదయానికి రూ. 47,450నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై,  ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

చెన్నై నగరం నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,730లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 లు ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 లు ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840లు ఉంది.

వెండి ధరలు: 

శనివారం ఉదయానికి వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలో శనివారం కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ కిలో వెండి రూ. 65,000లు ఉంది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 300మేర  పెరిగింది.

Also Read:

1971 War: ఆ రోజు ఏం జరిగిదంటే.. 1971 భారత్‌-పాక్‌ యుద్ధం విజయం చరిత్రాత్మకం.. బంగ్లాదేశ్ విముక్తి కోసం మేము..