Gold Silver Price Today: పెరుగుతున్న బంగారం ధరలు.. నిలకడగా ఉన్న వెండి.. ఏ నగరంలో ఎంత ధర అంటే..!

Gold Silver Price Today: పసిడి, వెండి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. తాజాగా సోమవారం..

Gold Silver Price Today: పెరుగుతున్న బంగారం ధరలు.. నిలకడగా ఉన్న వెండి.. ఏ నగరంలో ఎంత ధర అంటే..!
Gold And Silver

Updated on: Sep 06, 2021 | 5:22 AM

Gold Silver Price Today: పసిడి, వెండి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. తాజాగా సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు చేయడం మాత్రం ఆగరు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం (సెప్టెంబర్‌ 6) ఉదయం నమోదైన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,560 ఉంది.

వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.69,600 ఉండగా, కోల్‌కతాలో రూ.65,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, కేరళలో రూ.69,600 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,600 ఉండగా, విశాఖపట్నంలో రూ.69,600 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

అయితే బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!

Loading...
Unable to load recommendations.
Follow Us