Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే?

|

Oct 28, 2022 | 6:28 AM

మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280గా ఉంది.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే?
Gold Price Today
Follow us on

బంగాధం ధరలు తగ్గనంటున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్న 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.150 పెరగ్గా ఇవాళ (అక్టోబర్‌28) మళ్లీ రూ.100 పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.200 మేర పెరిగింది. కొత్త ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 58,300 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,530 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 పలుకుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక మారిన ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,300 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.63,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, చెన్నై, కేరళ లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక ముంబై, బెంగళూరు నగరాల్లో రూ.58,300 వద్ద ఉంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..