Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.400, 22 క్యారెట్లపై రూ.430 మేర ధర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.61,900 గా ఉంది. రూ.600 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,460, 24 క్యారెట్ల ధర రూ.52,860 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,900 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,900 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.66,100 ఉంది. బెంగళూరులో రూ.66,100, కేరళలో రూ.66,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,100, విజయవాడలో రూ.66,100, విశాఖపట్నంలో రూ.66,100 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: