Gold Price Today: పసిడి ప్రియులకు దిమ్మతిరిగేలా షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగిన రేట్లు..

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం (ఏప్రిల్‌ 13) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: పసిడి ప్రియులకు దిమ్మతిరిగేలా షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగిన రేట్లు..
Gold Price Today

Updated on: Apr 13, 2023 | 6:18 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం (ఏప్రిల్‌ 13) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,310 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.550 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,360లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,310 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,350 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.77,350
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400
  • బెంగళూరులో రూ.81,400
  • కేరళలో రూ.81,400
  • కోల్‌కతాలో రూ.77,350
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400
  • విజయవాడలో రూ.81,400
  • విశాఖపట్నంలో రూ.81,400 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us