Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

May 01, 2024 | 6:38 AM

బంగారం, వెండి ధరలు శాంతించాయి. ఈరోజు గ్రాము వెండి ధర 50 పైసలు తగ్గింది. కొన్ని దేశాల్లో బంగారం ధర కొంత మేర తగ్గింది. చెన్నై మినహా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రెండు మూడు వారాల క్రితం అసహజంగా పెరిగిన బంగారం ధర రానున్న రోజుల్లో క్రమంగా తగ్గుతుందని అంచనా. భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us on

బంగారం, వెండి ధరలు శాంతించాయి. ఈరోజు గ్రాము వెండి ధర 50 పైసలు తగ్గింది. కొన్ని దేశాల్లో బంగారం ధర కొంత మేర తగ్గింది. చెన్నై మినహా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రెండు మూడు వారాల క్రితం అసహజంగా పెరిగిన బంగారం ధర రానున్న రోజుల్లో క్రమంగా తగ్గుతుందని అంచనా. భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,550 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుండగా, నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ధరలు మే 1వ తేదీన ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

చెన్నై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,510
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,650.

ముంబై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

ఢిల్లీ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.740.

హైదరాబాద్‌:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

విజయవాడ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

బెంగళూరు:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

కోల్‌కతా:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

కేరళ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72.590.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. పరుగులు పెట్టిన సిల్వర్‌ దిగి వస్తోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.83,400 ఉంది.

ఈ బంగారం ధరలు నగరాలను బట్టి మారవచ్చు. పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి.

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి