Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇవాళ ఎంత పెరిగిందో తెలుసా ?

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. ఇవాళ మళ్లీ పరుగులు పెడుతుంది. బుధవారం ఉదయం

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇవాళ ఎంత పెరిగిందో తెలుసా ?

Updated on: Feb 10, 2021 | 7:25 AM

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. ఇవాళ మళ్లీ పరుగులు పెడుతుంది. బుధవారం ఉదయం బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జోరు మీద దూసుకెళ్తున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.540 పెరిగి.. రూ.46,890కు చేరింది. ఇదిలా ఉండగా.. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,890కు చేరింది.

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,710కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,650 ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.48,710కు చేరింది. దేశ రాజధాని డిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.51,050 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,890 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,890 దగ్గరగా ఉంది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,370 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450 దగ్గరగా ఉంది.

అటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్ కు 0.02 శాతం తగ్గుదలతో 1837 డాలర్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Also Read: Gold Rate Today: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా పెరిగిన పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. ఈసారి ఎంతంటే ?

Loading...
Unable to load recommendations.
Follow Us