భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందులోనూ భారతీయ మహిళలు.. పండుగతో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వ్యాపారులు కూడా డిమాండ్‌కు తగ్గట్టుగానే గోల్డ్ దిగుమతులను కూడా చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు డిమాండ్ మేరకు దిగుమతులు లేకపోతే.. బంగారం ధరలు పెరగడం పరిపాటిగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల్లోని బంగారం నిల్వలు, డాలర్-రూపాయ్ మారకం.. ఇలా పలు కారణాల వల్ల బంగారం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మహిళలకు గుడ్ న్యూసే. గత కొద్దిరోజులుగా పెరుగుతూపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త ఊరటనిచ్చాయి. ఒకట్రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు బంగారం ధరలు నిన్నటి పోలిస్తే.. ఎలాంటి మార్పు కనిపించట్లేదు. మరి లేట్ ఎందుకు బంగారం కొనేయాలనుకుంటే.. వెంటనే కొనేయండి మరి.
బులియన్ మార్కెట్‌లో సెప్టెంబర్ 12, మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,830గా ఉంది. నిన్నటితో పోల్చితే.. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక దేశంలోని పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 990గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది. ఇక ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59, 830గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర సెప్టెంబర్ 12, మంగళవారం రూ. 74, 500గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే.. కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74, 500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73, 250 ఉండగా.. ముంబైలో రూ. 74, 500గా కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000గా ఉంది.
[Automated 12-Sept 03:58 PM]
Nifty: 19993.2 🔴 -3.15
Sensex: 67221.13 🟢 94.05
BankNifty: 45511.35 🔴 -59.35
NiftyMidcap50: 11386.5 🔴 -339.15
Nifty Futs: 20037.3 🟢 0.6
BankNifty Futs: 45625 🔴 -72.85Data: investingcom
— Indian Sharemarket Updates (@stocks_in) September 12, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..