Gold Prices: రూ.6 వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోలు చేసేవారికి ఎగిరి గంతేసే వార్త..

బంగారం, వెండి ధరలపై భారీ శుభవార్త. ధరలు భారీగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ధరలు ఒకేసారి కుప్పకూలుతూ వస్తోన్నాయి. వారం రోజులుగా ధరల్లో భారీ తగ్గుదుల నమోదైంది. గత వారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Gold Prices: రూ.6 వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోలు చేసేవారికి ఎగిరి గంతేసే వార్త..
Gold

Updated on: Mar 08, 2026 | 3:33 PM

బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే పసిడి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పడిపోతూ వస్తోన్నాయి. గత వారంలో గోల్డ్, సిల్వర్ ధరలు ఒకేసారి పతనమయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ సమయంలో ధరలు తగ్గడం ఉపశమనం కలిగించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ధరలు పెరుగుతాయని ఊహించినవారికి సీన్ రివర్స్ అయింది. యుద్ద ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టపోగా.. పసిడి ధరలు కూడా తగ్గుతూ వస్తోన్నాయి. గత వారంలో మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. గత వారంలో ధరలు ఎలా తగ్గుతూ వచ్చాయో ఒకసారి చూద్దాం.

మార్చి 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,70,510గా ఉండగా.. మార్చి 8 నాటికి రూ.1,63,640కి దిగొచ్చాయి. అంటే వారంలో రూ.6870 మేర తగ్గాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,56,300గా ఉండగా.. మార్చి 8కు రూ.1.50 లక్షలకు తగ్గాయి. అంటే వారం రోజుల్లో రూ.6300 కుప్పకూలింది. మార్చి 3,4వ తేదీల్లో భారీగా తగ్గగా.. తర్వాత కాస్త పెరగాయి. చివరకు మరింత తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి.

తగ్గడానికి కారణాలివే..

బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అమెరికా డాలర్ బలహీన పడ్డ సమయంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల అమెరికా డాలర్ కాస్త కోలుకోవడంతో ధరలు తగ్గుతున్నాయి. ఇక ఇక ప్రాఫిట్ బుకింగ్, స్పెక్యులేటలివ్ సెల్లింగ్ కూడా ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా చెప్పవచ్చు.

ఆదివారం బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,63,640గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1.50 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్లు రూ.1,64,180గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,50,500గా కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్లు స్వచ్యమైన మేలిమి బంగారం రూ.1,63,640గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1.50 లక్షలుగా ఉంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు రూ.1,63,800గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,63,800 వద్ద కొనసాగుతోంది.

Follow Us