Telugu News Business Gold Rate Today: May 22 Gold, Silver Prices Witness Change; Check Rates in Hyderabad, Vijayawada and Major Cities
Gold Price Today: బంగారం కొనేవారికి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్నాగు. గత మూడు నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తలు, రూపాయి మారకం విలువే ఈ పెరుగుదలకు కారణం కావచ్చంటున్నారు విశ్లేషకులు. కాబట్టి ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold, Silver Prices: గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలలో కొనసాగుతున్న భారీ తగ్గుదల ఆగడం లేదు. సర్వకాలిక గరిష్ఠ స్థాయి (అత్యధిక స్థాయి)తో పోల్చి చూస్తే, బంగారం ధర దాని గరిష్ట ధర నుంచి సుమారు రూ.20,000 మేర తగ్గగా, వెండి ధర ఏకంగా రూ.1.23 లక్షల మేర పడిపోయిందనే చెప్పాలి. గతంలో ఉన్న ధరలను పోలిస్తే అసలు లెక్కలు తేలుస్తాయి. ప్రపంచ అస్థిరత మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,516 డాలర్లకు చేరువ కాగా, వెండి ధర ఔన్సుకు 76 డాలర్లకు చేరువయ్యింది.
పడిసి ప్రియులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత కొన్నాళ్లు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా మూడోరోజు మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చేసుకున్నాయి. దీంతో బంగారం కొనేవారు తీవ్ర నిరాశచెందుతున్నారు. ముందే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
బంగారం ధర కేవలం స్థానిక డిమాండ్‌పైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఇలాంటి సమయాల్లో స్టాక్ మార్కెట్లు నష్టపోయే ప్రమాదం ఉండటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి శుక్రవారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,610 గా ఉంది. ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రూ.2,85,100 వద్ద ట్రేడవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,200 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.
ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.1,59,940 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,110 వద్ద ట్రేడవుతోంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,610 వద్ద ట్రేడవుతోంది.