Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 60 వేలు దాటేశాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా మాత్రం బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720గా ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది.
* దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,300గా ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200, బెంగళూరులో రూ.76,200గా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఇక్క కిలో వెండి ధర రూ.76,200గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. రూ.76,200 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..