Gold Rate Today: ఆహా.. గోల్డ్ కొనాలనుకునేవారికి బిగ్ డే.. ఈ రోజు ధరలు ఇలా

|

Jul 06, 2024 | 8:55 AM

గోల్డ్ కొనేవారికి అలెర్ట్. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా అమ్ముతాం.. అప్పుడు 3 శాతం GST కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా మీకు భవిష్యత్‌లో ఇబ్బంది అవ్వొచ్చు. ఆభరణం మరమ్మతులకు వారు బాధ్యత వహించరు. గోల్డ్ క్వాలిటీ సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

Gold Rate Today: ఆహా.. గోల్డ్ కొనాలనుకునేవారికి బిగ్ డే.. ఈ రోజు ధరలు ఇలా
Gold Rate
Follow us on

పేద వర్గాలకి చెందిన జనాలు అయినా సరే.. కొంత నగదు కూడబెట్టుకుని.. బంగారం కొనాలని భావిస్తారు.  మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేవారికి కూడా బంగారం.. ఒక మంచి సోర్స్‌ అని చెప్పాలి. గతంలో మగువల మనసు ఎక్కువగా బంగారం వైపు ఉండేది. ఇప్పుడు పురుషులు సైతం గోల్డ్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక మనీ ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు బంగారం తాకట్టుపెట్టి.. తక్కువ వడ్డీతో నగదు తెచ్చుకోవచ్చు. శుభకార్యాలు,  పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే అందరూ బంగారం ధరిస్తారు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్. ఇక గోల్డ్‌పై మక్కువ ఉన్నవారు.. ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు కొందామా అని ఆరాటపడుతూ ఉంటారు. గత వారం నుంచి పైకి ఎగబాకుతున్న పసిడి రేట్లు… ఇవాళ స్థిరంగా కొనసాగుతూ భారీ ఊరటనిచ్చాయ్.. ఈ క్రమంలో తెలుగు స్టేట్స్‌లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

హైదరాబాద్:

  • 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 67,000 గా ఉంది
  • 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర రూ. 73,090

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 74,820గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర… 72,800గా ఉంది. 24 క్యారట్లు గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది బార్స్‌, కాయిన్స్ బిస్కెట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆభరణాల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడా బంగారాన్ని వినియోగిస్తారు.

బంగారం ధర నిలకడగా ఉండగా.. వెండి రేట్లు మరోసారి పెరిగాయి.  ఇవాళ వెండిరేటు రూ. 200 పెరిగిగా…  కిలో ధర రూ. 97 వేల 700కి చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..