Telugu News Business Gold Rate Today: April 20th 2023 Gold and Silver Price in Hyderabad Vijayawada Delhi Mumbai Chennai
Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి.
Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి. గురువారం (ఏప్రిల్ 20) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,050 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,150 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.77,600 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,150 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.77,600
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000
బెంగళూరులో రూ.81,000
కేరళలో రూ.81,000
కోల్‌కతాలో రూ.77,600
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000
విజయవాడలో రూ.81,000
విశాఖపట్నంలో రూ.81,000 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.