Gold Price Today: అదిరిపోయే న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

|

Oct 03, 2023 | 6:29 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే వీటి ధరలపై అందరూ దృష్టి పెడుతుంటారు. అయితే, అంతర్జాతీయంగా జరిగే పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే..

Gold Price Today: అదిరిపోయే న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price
Follow us on

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే వీటి ధరలపై అందరూ దృష్టి పెడుతుంటారు. అయితే, అంతర్జాతీయంగా జరిగే పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. గత కొంత కాలం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,040 గా ఉంది. తాజాగా, బంగారం ధర పది గ్రాములకు రూ.160 మేర తగ్గింది. కాగా.. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. రూ.73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,190 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,200, 24 క్యారెట్ల ధర రూ.58,040, కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.53,200, 24 క్యారెట్ల రేటు రూ.58,040 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.53,356, 24 క్యారెట్లు రూ.58,430గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,200, 24 క్యారెట్ల ధర రూ.58,040, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.53,200, 24 క్యారెట్లు రూ.58,040గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,200 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,040 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,040 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,000, ముంబైలో వెండి ధర రూ.73,000, చెన్నైలో రూ.75,500, బెంగళూరులో రూ.71,250, కేరళలో రూ.75,500, కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,500, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.75,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..