Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. శనివారం తులంపై ఏకంగా..

|

Sep 23, 2023 | 6:26 AM

దీంతో కేవలం రెండు రోజుల్లోనే తులంపై ఏకంగా రూ. 380 వరకు తగ్గుముఖం పట్టడం గమనార్హం. శనివారం 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి తులం గోల్డ్‌ ధర రూ. 59,840కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు...

Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. శనివారం తులంపై ఏకంగా..
Today Gold Price
Follow us on

బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన గోల్డ్ రేట్‌లో ఒక్కసారిగా తగ్గుదల కనిపించింది. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా, తాజాగా శనివారం ఒక్క రోజే మళ్లీ రూ. 200 వరకు తగ్గడం విశేషం. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తులంపై ఏకంగా రూ. 380 వరకు తగ్గుముఖం పట్టడం గమనార్హం. శనివారం 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి తులం గోల్డ్‌ ధర రూ. 59,840కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,940గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,100, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840గా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది. పుణెలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,850గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 54,850గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 59,840 ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…

బంగారం ధరలు తగ్గముఖం పడితే, వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం కిలో వెండిపై ఒకేసారి రూ. 1000 పెరుగుదల కనిపించడం గమనార్హం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. చెన్నెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 75,500కాగా, ఢిల్లీలో రూ. 75,500గా ఉంది. అలాగే కోల్‌కతాలో రూ. 75,500వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటు, విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..