బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశంలో కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మళ్ళీ బంగారం ధరలు అల్ టైం రికార్డును చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,000కి చేరింది. అంతేకాకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,180కి చేరింది. అటు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఇటీవల వెండి కిలో ధర రూ.60 వేలు దాటిన విషయం తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా స్థిరంగా రూ.66,800 వద్ద కొనసాగుతుంది.
అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా బంగారం ధరలు కాస్తా పెరిగాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.46 వేల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,180 చేరింది. కాగా ఇక్కడ కూడా వెండి ధర స్థిరంగానే కొనసాగుతుంది. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందన్న వార్తల దృష్ట్యా గత రోజులుగా పసిడి ధరలు కాస్తా తగ్గుతూ వస్తూన్నాయి. వెండి కూడా బంగారం దిశలోనే నడుస్తుంది. మళ్ళీ బంగారం ధరలు సుమారు 40 శాతం వరకు పెరిగాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం రేటుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.