Gold Prices: పండుగ సీజన్ వేళ బంగారం కొనేవారికి భారీ ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. ఇవాళ తులం ఎంతంటే..?

బంగారం ధరలపై మరో ఊరట. ధరలు పడిపోతూ వస్తోన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకి పడిపోతుండటంతో కొనుగోలుచేసేవారికి ఉపశమనం లభించింది. గత రెండు వారాలుగా ధరలు కుప్పకూలుతూనే ఉన్నాయి. అక్టోబర్ 16వ తేదీన ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

Gold Prices: పండుగ సీజన్ వేళ బంగారం కొనేవారికి భారీ ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. ఇవాళ తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Oct 16, 2026 | 6:26 AM

బంగారం ధరలపై గుడ్ న్యూస్. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పడిపోతూ వస్తోండగా.. శుక్రవారం కూడా పతనాన్ని చవిచూశాయి. ఈ వారం ప్రారంభం నుంచి ధరలు కుప్పకూలుతూనే ఉన్నాయి. పండుగల సీజన్ క్రమంలో ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. దసరా, దీపావళి వరుస పండుగల క్రమంలో బంగారం, వెండి కొనేందుకు చాలామంది ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ధరలు డౌన్ కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అక్టోబర్ 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

నేటి బంగారం ధరలు ఇవే..

-దేశ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,47,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140గా ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,430గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,1401 వద్ద ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,47,430గా ప్రస్తుతం ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,140 వద్ద కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,580 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,290గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,47,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140గా ట్రేడవుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,140గా ట్రేడవుతోంది.

సిల్వర్ రేట్లు ఇవే..

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,39,900గా కొనసాగుతోండగా.. నిన్న రూ.2.40 లక్షలుగా ఉంది.

-దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2,29,900గా ఉండగా.. నిన్న రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,39,900గా ఉండగా.. నిన్న రూ.2.40 లక్షలుగా ట్రేడవుతోంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,29,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us