Gold Price: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Jan 05, 2025 | 6:32 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. ఈ ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి బంగారం, వెండి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.. అయితే.. కొత్త సంవత్సరం కూడా ధరలు భగ్గుమంటున్నాయి.. ఆదివారం (05 జనవరి 2025) ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

Gold Price: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Prices
Follow us on

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే, ఒక్కోసారి బంగారం, వెండి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. కొత్త ఏడాది ప్రారంభంలో కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. తొలి రోజు మిన మిగతా రోజుల్లో ధరలు పెరిగాయి.. తాజాగా, గోల్డ్ ధర స్థిరంగా ఉండగా.. సిల్వర్ ధర తగ్గింది. ఆదివారం (05 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150, 24 క్యారెట్ల పసిడి ధర రూ.78,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.91,500 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150, 24 క్యారెట్ల ధర రూ.78,710 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150, 24 క్యారెట్ల ధర రూ.78,710 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,300, 24 క్యారెట్ల ధర రూ.78,860 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,150, 24 క్యారెట్ల ధర రూ.78,710 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.72,150, 24 క్యారెట్లు రూ.78,710 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,150, 24 క్యారెట్ల ధర రూ.78,710 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.99,000

విజయవాడ, విశాఖపట్నంలో రూ.99,000లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.91,500, ముంబైలో రూ.91,500, బెంగళూరులో రూ.91,500, చెన్నైలో రూ.99,000 లుగా ఉంది.