బ్రేకింగ్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!

| Edited By:

Aug 15, 2019 | 9:03 AM

నిన్నటి వరకూ కొండమీద కూర్చొన్న బంగారం ఒక్కసారిగా దిగొచ్చింది. ఒక్క రోజే.. ఏకంగా రూ.2,500 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల పదిగ్రాములు ధర రూ.37,000లు ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల పదిగ్రాముల ధర రూ.35 వేలుగా ఉంది. దీంతో… బంగారు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రెండ్ వున్నప్పటికీ రిటైలర్ల డిమాండ్‌ పడిపోవడంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ప్రభావం వల్లనే […]

బ్రేకింగ్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!
Follow us on

నిన్నటి వరకూ కొండమీద కూర్చొన్న బంగారం ఒక్కసారిగా దిగొచ్చింది. ఒక్క రోజే.. ఏకంగా రూ.2,500 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల పదిగ్రాములు ధర రూ.37,000లు ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల పదిగ్రాముల ధర రూ.35 వేలుగా ఉంది. దీంతో… బంగారు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రెండ్ వున్నప్పటికీ రిటైలర్ల డిమాండ్‌ పడిపోవడంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ప్రభావం వల్లనే బంగారం ధర తగ్గుముఖం పట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకుముందు పదిరోజులు వరుసగా పైపైకి ఎగబాకిన పసిడి.. ఇప్పుడు ఒక్కసారిగా రూ.2,500 తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నిన్నటివరకూ తులం బంగారం దాదాపు రూ.40 వేల వరకూ ఎగబాకింది. ముందు ముందు ఇంకా పెరుగుతుందని అందరూ అంచనా వేసినా.. అనుకోని విధంగా కిందకు దిగిరావడంతో.. బంగారు ప్రియులు కొనేందుకు సిద్ధమయ్యారు. కాగా.. కిలో వెండి కూడా రూ.690 తగ్గి రూ.44,310గా ఉంది.