Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

ప్రస్తుతం బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. అయితే రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?
Gold Prices

Updated on: Jul 11, 2026 | 10:43 PM

బంగారం ధరల గురించి ఎప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. ధరలు ఎలా ఉన్నాయనేది రోజు చెక్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గి.. మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంత కొత్త భయాలను రేకెత్తుతున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు దాదాపు 4 వేల డాలర్లకు చేరుకోగా.. దేశీయంగా 10 గ్రాముల ధరలు రూ. 1.40 లక్షల నుంచి రూ. 1.42 లక్షల మధ్య ఊగిసలాడుతుతోది.

బంగారం ధరల్లో చోటుచేసుకుంటున్న ఒడిదొడుకుల క్రమంలో పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళనలో ఉన్నారు. ఇటీవల కాలంలో భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో సురక్షిత పెట్టుబడిగా బంగారం ఆకర్షణను మరోసారి పెంచాయి. అలాగే ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలను తిరిగి రేకెత్తుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొంది. ఇది కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. అధిక వడ్డీ రేట్లు బంగారంపై భారం మోపగలిగే అవకాశముంది. ఈ క్రమంలో ఈ ఏడాది దీపావళి నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుత పరిణామాలను చూస్తే ధరలు పెరగవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీపావళి నాటికి బంగారం ధరలు రూ. 1.60 లక్షల వరకు పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అనిశ్చితి కొనసాగితే ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.45 లక్షల శ్రేణిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, బంగారం ధరలకు సుమారు 3,800 డాలర్ల వద్ద బలమైన మద్దతు లభించే అవకాశం ఉందని అంటుున్నారు. అటు వెండి ధరలకు దేశీయ మార్కెట్లో రూ. 2.20 లక్షల వద్ద బలమైన మద్దతు ఉందని, ఇది రూ. 2.28 లక్షల వైపు కదిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వెండి 60 డాలర్ల మార్కుకు సమీపంలో ట్రేడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us