Gold Prices: బంగారం ధరలపై పండుగలాంటి వార్త.. రానున్న రోజుల్లో ధరలు ఢమాల్..! కారణం ఇదే..

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో భవిష్యత్తులో పెరుగుతాయా..? లేదా మరింత తగ్గుదల నమోదవుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లపై ప్రముఖ బ్రోకింగ్ ఏజెన్సీ మోర్గాన్ స్టాన్లీ బాంబ్ పేల్చింది. ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది.

Gold Prices: బంగారం ధరలపై పండుగలాంటి వార్త.. రానున్న రోజుల్లో ధరలు ఢమాల్..! కారణం ఇదే..
Gold Prices

Updated on: Apr 30, 2026 | 4:35 PM

గత కొంతకాలంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యద్ద పరిస్థితులు సద్దుమణగడం, ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ డాలర్ బలపడుతుండటంతో గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. జనవరిలో గరిష్ట స్థాయిని తాకిన పసిడి ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత కుప్పకూలుతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ బంగారం ధరలపై కీలక అంచనా వేసింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోతాయని స్పష్టం చేసింది. 2026 ద్వితీయార్థంలో ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది.

బంగారం ధరలు తగ్గుతాయా..?

గతంలో ఔన్సుకు 5,700 డాలర్లుగా అంచనా వేసిన మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడు దానిని 5200 డాలర్లకు తగ్గించింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కొతల్లో జాప్యం చేయడం, వాస్తవ రాబడులు పెరుగుతుండటం, మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి గత ఆరు వారాలుగా నెలకొనడంతో అంచనాలను సవరించింది. అమ్మకాల ఒత్తిడి వల్ల గోల్డ్ రేట్లు 25 శాతం మేర పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతలను ఆలస్యం చేయడం వల్ల వాస్తవ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. దీని వల్ల బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు తమ వ్యూహాన్ని పునరాలోచించుకునేలా ప్రేరేపించిందని తెలిపింది. రాబోయే రోజుల్లో గోల్డ్ కేవలం అనిశ్చితికి వ్యతిరేకంగా ఒక రక్షణగా మాత్రమే కాకుండా ద్రవ్య లభ్యత పరిస్థితులు, బాండ్ దిగుబడులకు ఒక సూచికగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.

సెంటిమెంట్ ప్రభావం

ఇక గోల్డ్ రేట్లపై సెంటిమెంట్ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. డేటా ద్వారానే ఇవి ఎక్కువగా రూపుదిద్దుకుంటాయని మోర్గాన్ స్టాన్లీ చెప్పుకొచ్చింది. అటు భారత స్టాక్ మార్కెట్లు వేగవంతమైన పునరుద్దరణకు సిద్దంగా ఉన్నాయని తెలిపింది. బలమైన దేశీయ వృద్ది, ఆదాయాలు పెరుగుతుండటం, తక్కువ వాల్యుయేషన్ల వల్ల మార్కెట్లు వేగంగా పుంజుకుంటాయని స్పష్టం చేసింది. కాగా శుక్రవారం బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. ఇక నగరంలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది. గతంలో సిల్వర్ రేట్లు రూ.4 లక్షల గరిష్ట స్థాయికి చేరుకోగా.. గత కొంతకాలంగా దిగుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం రూ.2.60 లక్షల వద్ద ట్రేడువతున్నాయి. సిల్వర్  ధరలు కూడా పడిపోయే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

Follow Us