
Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత వారం ఇదే రోజుతో పోలిస్తే తులంపై ఏకంగా 5 వేల రూపాయలకుపైగా దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,940 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా కిలోపై స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.2,39,000 వద్ద కొనసాగుతోంది.
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతి రోజు ఉదయం 11 గంటల సమయంలో అప్‌డేట్ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఆ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది.
ఇది కూడా చదవండి: Best Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. అద్భుతమైన ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్!
హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ఇతర ఇతర నగరాల్లో రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది.
గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మే 10వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,53,140 ఉండగా, అది జూన్ 28వ తేదీ నాటికి సుమారు రూ.1,39,873కి పడిపోయింది. అంటే బంగారం ధర సుమారు రూ.13,267 మేర తగ్గింది. అదేవిధంగా వెండి ధర కూడా కిలోగ్రాముకు రూ.2,62,350 నుంచి రూ.2,16,541కి పడిపోయింది. అంటే వెండి ధర కిలోగ్రాముకు సుమారు రూ.45,809 మేర తగ్గింది. ఈ ధరల తగ్గుదల పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Electric Cars: సింగిల్ ఛార్జింగ్‌పై 656 కి.మీ. మైలేజ్.. మతిపోగొట్టే టాప్ 3 ఎలక్ట్రిక్ కార్లు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి