
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గినా భారీగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే దాదాపు లక్షా 40 వేల రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిన్నటి వరకు తులం బంగారం ధర రూ.1,42,000 వేలకుపైనే వెళ్లిన పసిడి.. తాజాగా మంగళవారం 1,39,240 వద్దకు చేరింది. ఈ లెక్కన దాదాపు 2000 వరకు తగ్గుముఖం పట్టింది. ఎంత తగ్గినా ఈ ధర కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,240 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.1,27,640 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.58,900 వరకు ఉంది.
హైదరాబాద్:
ఢిల్లీ:
ముంబై:
బెంగళూరు:
చెన్నై:
వెండి ధరలు ఆగే సూచనలు కనిపించడం లేదు. గత వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధర కిలోకు రూ.32000 కంటే ఎక్కువ పెరిగింది. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి ధర దాని మునుపటి ముగింపు రూ.2,39,787తో పోలిస్తే రూ.2,54,174కి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ విధంగా ప్రారంభంతోనే, ఈ విలువైన లోహం రూ.14,387 పెరిగింది.
ప్రస్తుతం దేశంలో బంగారం వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. బంగారంతో సమానంగా వెండి కూడా పరుగులు పెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని ఎలోన్ మస్క్ కూడా వెండి ధరల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి