Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు పెరుగుతూ ఉంటే మరోరోజు తగ్గుతూ వస్తోంది. రూ.50 వేల వరకు దాటిన పసిడి ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి..

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

Updated on: Sep 10, 2021 | 6:07 AM

Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు పెరుగుతూ ఉంటే మరోరోజు తగ్గుతూ వస్తోంది. రూ.50 వేల వరకు దాటిన పసిడి ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.50వేల లోపు నమోదు అవుతున్నాయి. తాజాగా శుక్రవారం పసిడి దిగి వచ్చింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. అందుకే స్త్రీలు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా 10 గ్రాముల ధరపై రూ.120 నుంచి 200 వరకు తగ్గుముఖం పట్టింది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,370 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,240 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,000 ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేవారు మీరు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం బెటర్‌.

ఇవీ కూడా చదవండి:

Ford India shut down: కార్ల తయారీ సంస్థ ఫోర్ట్‌ మోటార్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లో ప్లాంట్ల మూసివేత

LIC Policy: మీకు ఎల్ఐసీలో పాలసీ ఉందా..? వెంటనే ఈ పని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Loading...
Unable to load recommendations.
Follow Us