Gold Price Today: మళ్లీ పసిడి ప్రియులకు షాక్‌.. పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ధర ఎంత పెరిగిందంటే..!

Gold Price Today: దేశ వ్యాప్తంగా ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నెలలో తగ్గుముఖం పట్టిన ధర.. తాజాగా ఎగబాకుతోంది. తాజాగా బుధవారం...

Gold Price Today: మళ్లీ పసిడి ప్రియులకు షాక్‌.. పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ధర ఎంత పెరిగిందంటే..!
Follow us

|

Updated on: May 12, 2021 | 6:10 AM

Gold Price Today: దేశ వ్యాప్తంగా ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నెలలో తగ్గుముఖం పట్టిన ధర.. తాజాగా ఎగబాకుతోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు పెరిగాయి. అయితే ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా అంటే రూ.90 వరకు పెరుగగా, హైదరాబాద్‌లో రూ.100 వరకు పెరిగింది. ఇక దేశీయంగా తాజా ధరలను పరిశీలిస్తే..

ప్రధాన నగల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,910 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 వద్ద ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Tata Motors: కార్లపై భారీ ఆఫర్‌ ప్రకటించిన టాటా మోటార్స్‌.. 65 వేల రూపాయల వరకు ఆదా..!