Telugu News Business Gold Price Today, May 12: Check 22K and 24K Gold, Silver Rates in Hyderabad, Delhi, Vijayawada, and Major Cities
Gold Price Today: వరుసగా 4రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. తన నాలుగైతు రోజులుగా ఈ ఆభరణాల ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి కూడా పడిసి ధరలు తగ్గాయి. కాబట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Gold Price: ఇది కదా కావాల్సింది.. కొన్ని గంటల్లోనే బంగారం ధర భారీగా పతనం.. మరి వెండి సంగతేంటి? Gold, Silver Prices Tody: ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతల అవకాశాలు తగ్గాయి. ఇది బంగారం, వెండి ధరలు తగ్గడానికి దారితీసింది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారకంతో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడూ మార్పులు వస్తుంటాయి. దానికితోడు తాజాగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా వాటి షేర్లపై భారీ ప్రభావం చూపాయి. మోదీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మార్కెట్‌లో బంగారం షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత నాగులు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతనూనే వస్తున్నాయి. కాబట్టి మంగళవారం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120 గా ఉండగా నిన్న ఈ ధర 1,52,234గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర చూసుకుంటే ప్రస్తుతం రూ.1,39,440 గా ఉండగా నిన్న ఈ ధర 1,39,640 గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర రూ.2,74,800 వద్ద ట్రేడవుతుంది.
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,39,440 గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర
రూ.1,39,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,800గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,810,గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,990గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,270, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ1,39,590 వద్ద కొనసాగుతుంది.ఇక వెండి
వెండి ధరలు చూసుకుంటే దేశీ మార్కెట్‌లో కేజీ వెడి ధర రూ.రూ.2,74,800 గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,85,100 గా ఉంది