Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పసిడి, వెండి ప్రియులకు ఊరట లభించింది.

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Mar 26, 2023 | 6:28 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పసిడి, వెండి ప్రియులకు ఊరట లభించింది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.54,850 కి చేరగా.. 24 క్యారెట్ల ధర రూ.160 మేర తగ్గి 59,840 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.73,300లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,990గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,550
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,890
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,840 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000, బెంగళూరులో రూ.76,000, కేరళలో 76,000, కోల్‌కతాలో 73,300, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000, విజయవాడలో రూ.76,000, విశాఖపట్నంలో రూ.76,000 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us