Gold and Silver Price Today: అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు పతనమవుతుంటాయి. సాధారణంగా బంగారానికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాలు ఉన్నా.. ఏమైనా శుభకార్యాలున్నా.. చాలామంది బంగారాన్ని కొంటుంటారు. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం స్థిరంగా కొనసాగుతుండంగా.. 24 క్యారెట్ల బంగారం రూ.100 మేర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.600 మేర పెరిగింది.
బంగారం ధరలు.. హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,350 ఉండగా.. రూ.59,180 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు 54,350, 24 క్యారెట్లు రూ.59,180 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.54,750, 24 క్యారెట్లు రూ.59,730, ముంబైలో 22క్యారెట్లు రూ.54,350, 24 క్యారెట్లు 59,180గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,430 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లు రూ.54,350, 24 క్యారెట్లు రూ.59,280గా ఉంది.
వెండి ధరలు.. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700, ముంబైలో రూ.71,500, ఢిల్లీలో రూ.71,500, బెంగళూరులో రూ.70,250, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.75,700, విజయవాడలో రూ.75,700, విశాఖపట్నంలో రూ.75,700 గాఉంది.
గమనిక.. ఈ ధరలు బుధవారం ఉదయం వరకు నమోదైనవి మాత్రమే.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..