Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

|

Dec 10, 2021 | 6:22 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలకు.. బ్రేక్ పడుతూ వస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. నిన్న పెరిగింది. ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం (డిసెంబర్‌ 10)న దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా కొనసాగుతుండటంతో బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌ అని చెప్పాలి. తాజా దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390 వద్ద ఉంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,840 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,140ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ అయ్యింది..? ఇలా తెలుసుకోండి..!

Visakha Railway Zone: మరో విభజన హామీకి కేంద్రం స్వస్తి.. మళ్లీ ఉద్యమ బాట పడతామంటున్న ఉత్తరాంధ్ర వాసులు