
Gold Price Today: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఎంత తగ్గినా.. మళ్లీ మరుసటి రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు డెబ్బై, ఎనబై వేల రూపాయల వద్ద ఉండే బంగారం ధరలు.. ఇప్పుడు రెట్టింపు ధరతో ట్రేడవుతున్నాయి. ఇటీవల తులం ధర లక్షా 20 వేలకు దిగువన ఉండగా, ఇప్పుడు లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా డిసెంబర్ 20న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూన.1,22,990 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,08,900 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే ఇంకా భారీగా ఉంది. రూ.2,20,900 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Success Story: చదివింది 8.. చిన్న కిరాణా షాపుతో ప్రారంభించి నేడు రూ.8000 కోట్లకు.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నివాసం!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.
ఇది కూడా చదవండి: Indian Railways: బిగ్ అప్‌డేట్.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి