Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. వరుసగా మూడో రోజు..

|

Feb 15, 2024 | 6:30 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 57,140 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300గా ఉంది. అదే విధంగా భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల...

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. వరుసగా మూడో రోజు..
Gold Price Today
Follow us on

ఆకాశమే హద్దుగా ప్రతీ రోజూ పెరుగుతూ పోయిన బంగారం ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. అయితే ఈ తగ్గుదల చాలా స్వల్పమేనని చెప్పాలి. వరుసగా మూడు రోజులుగా బంగారం ధరపై రూ. 10 తగ్గుతూ వస్తోంది. అయితే ఇది స్వల్పమే అయినా పెరుగుతోన్న ధరల నుంచి కొనుగోలు దారులకు ఊరటా చెప్పొచ్చు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ఉన్న నేపథ్యంలో కూడా ధరలు శాంతిండచం గమనార్హం. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 57,140 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300గా ఉంది. అదే విధంగా భారత ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుముఖం కనిపించిది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగరాం ధర రూ. 62,170గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే సాగుతోంది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. గురువారం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 73,900కి చేరింది. ఇక చెన్నైతో పాటు హైదారాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..