Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా స్టాక్ మార్కెట్ వంటి..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో విధించిన టారిఫ్ సుంకాలు ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నారు.

Updated on: May 19, 2025 | 7:11 AM

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఇటీవల లక్ష రూపాయలు దాటిన గోల్డ్‌ ధర.. ప్రస్తుతం దిగి వచ్చింది. మీరు బంగారం కొనాలని చూస్తే మే 19వ తేదీన బంగారం ధరల గురించి తెలుసుకోండి.

సోమవారం బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశీయంగా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర 87,190 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 95,120 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే వెండి ధర విషయానికొస్తే 96,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ87,190 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.95,120 వద్ద ఉంది. ఇక ఢిల్లీ ధర విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,270 ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 87,190 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,120 ఉంది.

ఇది కూడా చదవండి: Ambani House: మీరు అంబానీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? కేవలం రూ.2తోనే చూడొచ్చు!

గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా స్టాక్ మార్కెట్ వంటి ఎంపికలను ఇష్టపడతారు ఎందుకంటే వాతావరణం బాగున్నప్పుడు, ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

దీనితో పాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొంటుందనే ఆశ, భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ముగిసిన వార్త కూడా బంగారం డిమాండ్‌ను ప్రభావితం చేశాయి. అంతేకాకుండా, డాలర్ ధర పెరుగుదల, స్టాక్ మార్కెట్ పెరుగుదల కూడా బంగారం మెరుపును తగ్గించాయి. అయితే, కొన్ని రోజుల క్షీణత తర్వాత, ఆ ధోరణి మళ్ళీ పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: AC Compressor: ఏసీ కంప్రెసర్‌ ఎందుకు పేలుతుంది..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే బ్లాస్టింగే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి