Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!

Gold Price Today: ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లించడం ఈ ధరల క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!

Updated on: Dec 10, 2025 | 6:39 AM

Gold Price Today: కొనుగోలుదారులకు తీపి కబురు. స్థానిక బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఒకే రోజు రూ.300 మేర ధర పతనమైంది. అయితే డిసెంబర్‌ 8న తులం బంగారం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం చూస్తే భారీగానే తగ్గుముఖం పట్టింది. దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గిందనే చెప్పాలి. అలాగే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు కాస్త బ్రేక్ పడింది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లించడం ఈ ధరల క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం పసిడిపై తీవ్ర ప్రభావం చూపింది.

తాజాగా డిసెంబర్ 10న హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,29,430, ఉండగదా, 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ పతనం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం ఇచ్చింది. అయినా తులం బంగారం ధర కొనాలంటే లక్షా 30 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే.

Best Car: ఇదేందిరా నాయనా.. ఎగబడి కొంటున్నారు.. మరోసారి నంబర్‌ 1 స్థానంలో..!

వెండి ధరలు మాత్రం పైకి చేరాయి. గోల్డ్ రేట్ తగ్గుతున్నప్పటికీ, సిల్వర్ రేట్‌ మాత్రం పైపైకి చేరాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది. అంటే రెండు లక్షల రూపాయల వరకు ఉంది. ఇక దేశీయంగా చూస్తే కిలో వెండి ధర రూ.1,90,100 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,29,430, ఉండగదా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,990 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,790 ఉంది.

బంగారం ధరల తగ్గుదల తాత్కాలికమేనా, లేక కొనసాగుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. మార్కెట్ నిపుణులు మాత్రం ధరల హెచ్చుతగ్గులు మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కారు VIP నంబర్ నంబర్‌ ఖరీదు రూ.27.50 లక్షలు.. కొన్నది ఎవరో తెలుసా?

Nirma Girl: నిర్మా వాషింగ్‌ పౌడర్‌పై ఉన్న బాలిక ఎవరో తెలుసా? అదో విషాద గాథ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి