Gold Price Today: దిగిరానంటున్న బంగారం ధర.. లక్ష చేరువలో వెండి.. తాజా రేట్ల వివరాలు

|

Jun 19, 2024 | 6:24 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతంది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర సమయాల్లో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. జూన్‌ 19వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల

Gold Price Today: దిగిరానంటున్న బంగారం ధర.. లక్ష చేరువలో వెండి.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us on

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతంది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర సమయాల్లో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. జూన్‌ 19వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,210 ఉంది.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,190 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ.72,210 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,050 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,460 వద్ద ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,210 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,210 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,210 ఉంది.
  • అలాగే కిలో వెండి ధర రూ. 91,600 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Insurance Claim: 45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?

బంగారం ధరలు మార్కెట్ ట్రెండ్స్ మరియు వడ్డీ రేట్లను సూచిస్తాయి. వీటిలో GST, TCS మరియు ఇతర ఛార్జీలు ఉండవు. తాజా మరియు ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి. మేకింగ్ ఛార్జీలు వర్తించవచ్చు.

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

ఇది కూడా చదవండి: Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి