గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ ఇది. బంగారం కొనేందుకు సరైన సమయం. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ సుమారు రూ. 1400 మేరకు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1500కి పైగా తగ్గింది. ఇక నిన్నటితో పోలిస్తే.. ఇవాళ శనివారం రూ. 980 మేరకు గోల్డ్ ధర తగ్గింది. మరి దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,550గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,040గా కొనసాగుతోంది. ఇక కోల్‌కతాతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,400గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,890గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలో పయనిస్తోంది. గత రెండు రోజులుగా వెండి రేట్లు రూ. 4000 మేరకు తగ్గాయి. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ. లక్ష ఉండగా.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కేజీ వెండి ధర రూ. 92,500గా కొనసాగుతోంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..