Gold Price Today
Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. శుక్రవారం (ఏప్రిల్ 21) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.200, 24 క్యారెట్లపై రూ.220 మేర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.77,400 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080 గా ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,400 లుగా ఉంది.
- ముంబైలో కిలో వెండి ధర రూ.77,400
- చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000
- బెంగళూరులో రూ.81,000
- కేరళలో రూ.81,000
- కోల్‌కతాలో రూ.77,400
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000
- విజయవాడలో రూ.81,000
- విశాఖపట్నంలో రూ.81,000 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..