Gold, Silver Price Today: బులియన్ మార్కెట్లో పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 11) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,430 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.390, 24 క్యారెట్లపై 430 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి.. రూ.76,300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,430 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430 లుగా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100, కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..