Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Apr 30, 2021 | 6:41 AM

Today Gold Rates: దేశంలో ఇటీవల కాలంలోని తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Today Gold Rates: దేశంలో ఇటీవల కాలంలోని తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 40వేలకు చేరువులో వచ్చిన ధరలు.. మళ్లీ 44 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయల మేర తగ్గింది. గురువారం 44,490 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు శుక్రవారం 44,480 గా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..

కాగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర 150 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,330 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 45,680 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 49,860 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,480 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,480 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో ధర 150మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,370 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,390 వద్ద కొనసాగుతోంది.

 

Also Read:

Marriage: ‘మా నాన్నకు పెళ్లి’ చేశాను..అందరూ ఆశీర్వదించండి..తండ్రి పెళ్లి ఫోటో పోస్ట్ చేసిన కూతురు!

Exit Polls 2021: తమిళనాట డీఎంకే.. బెంగాల్ దీదీకే..కేరళలో మళ్ళీ విజయన్ సర్కారే అంటున్న ఎగ్జిట్ పోల్స్..ఆ లెక్కలు ఇలా..