Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈరోజు హైదరాబాద్లో తులం ధర ఎంతంటే..

ఈమధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈరోజు హైదరాబాద్లో తులం ధర ఎంతంటే..
Gold Price Today

Updated on: Jan 06, 2024 | 6:14 AM

ఈమధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 63,380 కాగా ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,270కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ.58,000 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ కనిపించడం లేదు. అలాగే స్థిరంగా కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 78,000 కాగా ఈరోజు కూడా అదే ధరల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,270
  • విజయవాడ..రూ. 63,270
  • ముంబాయి..రూ. 63,270
  • బెంగళూరు..రూ. 63,270
  • చెన్నై..రూ. 63,930

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 58,000
  • విజయవాడ..రూ. 58,000
  • ముంబాయి..రూ. 58,000
  • బెంగళూరు..రూ. 58,000
  • చెన్నై..రూ.58,600

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 78,000
  • విజయవాడ..రూ. 78,000
  • చెన్నై..రూ.78,000
  • ముంబాయి..రూ. 76,600
  • బెంగళూరు..రూ. 74,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us