Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Jun 25, 2021 | 5:25 AM

Gold Rates Today: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. దేశంలో బంగారం ధరలు కొన్నిరోజులుగా

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us on

Gold Rates Today: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. దేశంలో బంగారం ధరలు కొన్నిరోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బంగారం ధర మళ్లీ కొంతమేర పెరిగింది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. శుక్రవారం బంగారం ధర 100 గ్రాములపై రూ.400 మేర పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,190 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధర రూ. 100 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,250 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,190 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,190 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,000 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,440 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. రూ. 100 మేర ధర తగ్గింది.
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,000 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,000 వద్ద కొనసాగుతోంది.

Also Read:

‘పిల్లలు ఎందుకు అంత త్వరగా పెరుగుతారు’.. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసిన ప్రియాంక గాంధీ

Spider Man: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌..ఎందుకో తెలిస్తే మీరు కూడా అభినందిస్తారు..