
పసిడి మరింత ప్రియంగా మారుతోంది..గత ఏడాది కాలంగా భగ్గుమన్న బంగారం.. 2026 ఆరంభం నుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో కొత్త ఆశలు కలిగించింది. గోల్డ్ పతనం దిశగా పయనిస్తూ కొనుగోలు దారులను ఊరించింది. ధరలు మరింత తగ్గుతాయని కూడా కొందరు మార్కెట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. దాంతో చాలా మంది బంగారం ధర మరింత తగ్గుతుందని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ షాక్ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేసింది. వెండి, ప్లాటినమ్, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ మే13 నుంచే అమలు అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకాయి.
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. నేడు దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల వల్ల ధరల్లో హెచ్చతగ్గులు నమోదు అవుతున్నాయి. ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు మారుతూనే ఉన్నాయి. కాబట్టి, ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం.
భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,62,010లకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ. 1,48,510లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,680, 22 క్యారెట్ల ధర రూ.1,50,010 ఉంది. వెండి కిలో ధర రూ.3,20,100 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,62,160, 22 క్యారెట్ల ధర రూ.1,48,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,10,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,48,510 ఉంది. వెండి కిలో ధర రూ.3,10,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,62,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,48,510 ఉంది. వెండి కిలో ధర రూ.3,10,100 లుగా ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,62,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,48,510 ఉంది. వెండి కిలో ధర రూ.3,30,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,48,510 ఉంది. వెండి కిలో ధర రూ.3,20,100 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,62,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,48,510 ఉంది. వెండి కిలో ధర రూ.3,20,100 లుగా ఉంది.
బంగారం ఇలా ఉంటే, నిన్నటితో పోల్చితే వెండి కిలోపై మరో రూ.100 లు పెరిగింది. దీంతో గ్రాము వెండి ధర రూ. 320.10 లు ఉండగా, కేజీ సిల్వర్ ఏకంగా రూ.3,20,100కు చేరింది.
ఇకపోతే, మార్కెట్ నిపుణల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. అందులో
బంగారం ధరలు కేవలం స్థానిక డిమాండ్‌పైనే కాకుండా పలు అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి.
అంతర్జాతీయ మార్కెట్: ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరిగితే, దాని ప్రభావం నేరుగా కటక్ మార్కెట్‌పై పడుతుంది.
రూపాయి విలువ: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి వ్యయం పెరిగి బంగారం ధరలు పెరుగుతాయి.
కేంద్ర బ్యాంకుల నిల్వలు: ఆర్‌బిఐ (RBI) వంటి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ ఉంచుకోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతుంది.
మీరు బంగారం కొనాలని ఆలోచిస్తుంటే, కేవలం ధరనే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ఎల్లప్పుడూ హాల్ మార్క్ (Hallmark) ముద్ర ఉన్న బంగారాన్ని మాత్రమే ఎంచుకోండి. ఇది బంగారం స్వచ్ఛతకు గ్యారెంటీ ఇస్తుంది. అలాగే, వేర్వేరు జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు (తయారీ ఖర్చులు) భిన్నంగా ఉంటాయి కాబట్టి, కొనే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ఉత్తమం.
ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో, బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గమని నిపుణులు భావిస్తున్నారు. వినియోగదారులు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు. తాజా ధరల కోసం ఎప్పటికప్పుడు విశ్వసనీయ వెబ్‌సైట్‌లను చూస్తూ ఉండండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.