Today Gold Rates: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 40వేలకు చేరువలో వచ్చిన ధరలు.. మళ్లీ 45 మార్క్ దాటాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 50 రూపాయల మేర పెరిగింది. గురువారం 45,200 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు శుక్రవారం 45,250 గా ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 60 మేర పెరిగింది. నిన్న రూ.46,590 ఉన్న ధర ఈ రోజు 46,650 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 50,850 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 45,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,250 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..
కాగా హైదరాబాద్‌లో అత్యధికంగా పసిడి ధర 250 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,200 వద్ద కొనసాగుతోంది.
Also Read: