Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Jul 17, 2024 | 6:46 AM

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. బంగారానికి లోకల్‌గా డిమాండ్ తక్కువగానే ఉన్నా..

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price
Follow us on

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. బంగారానికి లోకల్‌గా డిమాండ్ తక్కువగానే ఉన్నా, అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోందంటున్నారు. వాస్తవానికి బంగారమంటే భారతీయలకు లోహం కాదు..అదొక సెంటిమెంట్‌. అందుకే ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉండే బంగారం.. నేడు అవసర వస్తువుగా మారింది. అంతే కాదు..బంగారం ఉంటే.. అదో నిశ్చింత. భవిష్యత్తుకు అదో భరోసా.. అందుకే చాలా మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు.

తాజాగా.. బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం (17 జులై 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 74,030 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 67,860 గా ఉంది.. వెండి ధర కిలో రూ.94,900లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,020గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,020గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,010, 24 క్యారెట్ల ధర రూ.74,180 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.67,860, 24 క్యారెట్లు రూ.74,030, చెన్నైలో 22క్యారెట్లు రూ.68,310, 24 క్యారెట్లు రూ.74,520, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.67,860, 24 క్యారెట్లు రూ.74,030గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.94,900, ముంబైలో రూ.94,900, బెంగళూరులో రూ.94,150, చెన్నైలో రూ.99,400, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.99,400 లుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..