Gold Price Today: ఉక్రెయిన్, రష్యాల (Ukraine Russia War) మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై కూడా స్పష్టంగా పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం మరికొంత ఎక్కువేనని చెప్పాలి. ఇలా భారత్‌లో పెరుగుతోన్న ధరల్లో బంగారం ఒకటి. రష్యా, ఉక్రెయి యుద్ధ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 52 వేలు దాటేసింది. ఇదిలా ఉంటే శనివారం కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించలేదు. ఈరోజు దేశ వ్యాప్తంగా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,200 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,570 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,570 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ. 210 పెరిగి, రూ. 49,060వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 230 పెరిగి రూ. 53,520 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,580 గా ఉంది.
* హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,580 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,200 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,580 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,580 గా ఉంది.